Undavalli Arun Kumar : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత రసవత్తరం అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ విశ్లేషణలు చేస్తూ సర్వేల పేరుతో జోస్యం చెబుతున్నారు. రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారు తప్ప.. నోటా జోలికి వెళ్లడంలేదని చెప్పుకొచ్చారు.
‘జైలుకెళితే ఓడిపోతాననడం అర్థరహితం. జైలుకు వెళ్లిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు… రాగానే గెలిచాడు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు.. గెలిచాడు. ఇవాళ చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు. అందరూ అదే అంటున్నారు… చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు, గెలుస్తాడు అంటున్నారు’ అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పార్లమెంటు తలుపులు మూసి, ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారుచేశారు. ఆ చట్టాన్నే అమలు చేయడానికి తిరగబడమంటున్నామన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
చంద్రబాబు, పవన్ కలయిక ఇప్పుడు పెద్ద ప్లస్ అయింది. వారిద్దరి కలయిక జగన్‌కి వ్యతిరేఖం అవుతుంది. వచ్చే ఎన్నికలలో వార్ వన్ సైడ్ అవుతుంది అన్నట్టుగా కామెంట్ చేశారు అరుణ్ కుమార్.ఏదైనా వివాదాస్పద అంశంలో వాళ్లది రైటా, మనది రైటా అని తిరగబడానికి కొంచెం ఆలోచించడంలో తప్పులేదు. మిగతావారంతా సపోర్ట్ చేస్తారో, చేయరో అని ఆలోచించడం సమంజసమే. కానీ చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా తిరగబడకపోతే ఎలా? ప‌్రజలలో మార్పు రావాలి అంటూ అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.