బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఈ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చడం.. నిజంగా ఇది ప్రశంసనీయమైన చర్య.
గత వలస వారసత్వ బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకోవడం ఓ మంచి పరిణామం. శతాబ్ధాల పాటు దేశాన్ని తీవ్రంగా అణివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే మీ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింపజేసేలా చేస్తుంది. వందల ఏళ్లపాటు ప్రాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, అటు వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ.. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడమనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా మీ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.