Nagababu : తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికలలో ఎవరు అధికారం దక్కించుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరి కొద్ది నెలలో జరగనున్న ఏపీ ఎన్నికల కోసం అన్ని పార్టీల వారు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విశాఖపట్నంలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ వేదికగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక తాను నడవడం లేదన్న పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని అన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదన్న జనసేనాని.. మార్పు కోసం తమను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చినట్లు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.
దురదృష్టవశాత్తూ 2019లో కుదరలేదన్న జనసేనాని.. 2024లో ఏపీ భవిష్యత్తు కోసమే మరోసారి కలిసివస్తున్నట్లు చెప్పారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వానిదే అధికారం. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారు. మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయారు.” అని నాగబాబు అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా ముందుకు నడిపించిన ఆయనని ఓడించారు. ఏపీలో ఏం చేయని జగన్‌ని తప్పక ఓడిస్తారని, ఈ సారి జనసేన- టీడీపీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని అన్నారు. ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ వైరల్‌గా మారాయి.
![Nagababu : అంత చేసిన కేసీఆర్‌నే ఓడించి కూర్చోబెట్టారు.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అంటూ.. జగన్‌పై నాగబాబు ఫైర్.. Nagababu serious comments on cm ys jagan](http://3.0.182.119/wp-content/uploads/2023/12/nagababu.jpg)
ఇక ఈ సభలో 2008 లో మనం పెట్టిన రాజకీయ పార్టీని నిలబెట్టి కోలేని తనం తో చాలా నేర్చుకున్నానన్నారు పవన్ కళ్యాన్. జనసేన పార్టీని మరి ఏ పార్టీ లో కలపనన్నారు పవర్ స్టార్. తాను మరణించిన కూడా పార్టీ బ్రతికే వుండాలి అనే విధానం తో వున్నానన్నారు. అడవులు లో వెళ్ళి పోయి పోరాటం చేస్తే అది కేవలం పోరాటం మాత్రమే.. కానీ ఫలితాలు రావాలన్నారు. బీజేపీ, టీడీపీతో కలిసి 2014 లో పోటీ చేశానన్నారు. 2024 లో మాత్రం ఏపీలో బంగారు బాట వేయాలి.. మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన నిలబడ్డ స్థానాల్లో మెజారిటీ తో గెలిస్తే మనం ఏమి అయినా అడగ్గలం అన్నారు పవన్.