Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Hyper Aadi : ఇన్‌డైరెక్ట్‌గా రోజాకి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన హైప‌ర్ ఆది

Shreyan Ch by Shreyan Ch
October 4, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Hyper Aadi : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపులారిటీ ద‌క్కించుకున్న‌హైప‌ర్ ఆది ప్ర‌స్తుతం న‌టుడిగా కూడా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న తాజాగా ‘రూల్స్ రంజన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.సినిమా పరిశ్రమపై విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. సినిమాల నుంచి నేర్చుకునేది ఎంత ఉందో గుక్క తిప్పుకోకుండా చెబుతూ 14 నిమిషాల పాటు మాట్లాడాడు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజుతో మొదలుపెట్టి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు యువ నటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, రాణా, నాగచైతన్య, విశ్వక్‌సేన్ వరకూ ఇండస్ట్రీలోని అన్ని తరాలను, అందరు హీరోలను కవర్ చేశాడు. ఒక్కో హీరో గురించి ఒక్కో స్పెషాలిటీ చెబుతూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

సినిమా అనేది ఎప్పుడూ మంచే నేర్పింది. చెడు ఎప్పటికీ నేర్పించదు. సినిమాల్లో చూపించే చెడును కాదు, మంచిని మాత్రమే స్వీకరించాలి. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోండి. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన, నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని, ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారం ఉన్న కృష్ణం రాజుగారి నుంచి ఎంతో నేర్చుకోవాలి.

Hyper Aadi strong counter to roja
Hyper Aadi

సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుగారి నుంచి నేర్చుకోవాలి. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవి చూసి నేర్చుకోండి. ఆయన తల్లికి క్యాన్సర్‌ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణగారిని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలి. ఆరు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మధుడిలా కనిపించే నాగార్జును, నాన్న గొప్పొడు నేను కాదు అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్‌, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు దైవంగా భావించే మోహన్‌బాబుగారిని చూసి గురు భక్తిని నేర్చుకోండి. ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేశ్‌బాబుని చూసి చాలా నేర్చుకోవచ్చు. పేదల ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించి పవన్‌కల్యాన్‌ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రానా, గోపీచంద్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌, ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు”అంటూ హైప‌ర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశారు.

Tags: Hyper AadiRoja
Previous Post

Actor Siddarth : పాపం.. సిద్ధార్థ్‌ని ఏడిపించేశారు.. క‌న్నీళ్లు పెట్టుకుంటూ..

Next Post

Dhoni And Ram Charan : 13 ఏళ్ల త‌ర్వాత ఒకే ఫ్రేములో రామ్ చ‌ర‌ణ్‌, ధోని.. ఇలా క‌ల‌వ‌డానికి కార‌ణం ఏంటి?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Chandra Babu : బ‌ర్రెల‌క్క‌కి స‌పోర్ట్‌గా నేను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ‌తామంటున్న చంద్ర‌బాబు
politics

Chandra Babu : బ‌ర్రెల‌క్క‌కి స‌పోర్ట్‌గా నేను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ‌తామంటున్న చంద్ర‌బాబు

November 23, 2023
Purandeshwari : తెలంగాణ‌లో ప‌వ‌న్ ప్ర‌చారంపై పురందేశ్వ‌రి సంచ‌ల‌న కామెంట్స్‌..!
politics

Purandeshwari : తెలంగాణ‌లో ప‌వ‌న్ ప్ర‌చారంపై పురందేశ్వ‌రి సంచ‌ల‌న కామెంట్స్‌..!

November 23, 2023
Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

November 23, 2023
Ponnavolu : చంద్ర‌బాబు బెయిల్‌పై పొన్న‌వోలు సంచ‌ల‌న కామెంట్స్
politics

Ponnavolu : చంద్ర‌బాబు బెయిల్‌పై పొన్న‌వోలు సంచ‌ల‌న కామెంట్స్

November 23, 2023
Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్
క్రీడ‌లు

Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్

November 23, 2023
Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్

November 23, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్
క్రీడ‌లు

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

by Shreyan Ch
November 15, 2023

...

Read more
Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్
politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

by Shreyan Ch
November 17, 2023

...

Read more
Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
వార్త‌లు

Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
November 20, 2023

...

Read more
Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!
వార్త‌లు

Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!

by Shreyan Ch
November 20, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.