Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

AAG Ponnavolu Sudhakar Reddy : చంద్ర‌గ‌హ‌ణం వీడింది.. ఇంకో ఇద్ద‌రు మిగిలారు అంటూ పొన్న‌వోలు షాకింగ్ కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
September 13, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

AAG Ponnavolu Sudhakar Reddy : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత ఒకే ఒక్క పేరు మారుమ్రోగిపోతుంది. ఆ పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అదనపు అడ్వొకేట్ జనరల్. ఆయనే ఈ కేసును వాదించారు. సీఐడీ తరఫున సమర్థవంతంగా తన వాదనలను వినిపించగలిగారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి న్యాయమూర్తికి వివరించగలిగారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వంటి కొమ్ములు తిరిగిన అడ్వొకేట్ వాదనలను సైతం వీగిపోయేలా చేయగలిగారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కేసును వాదించడానికి గంటకు రెండు కోట్ల రూపాయలను చంద్రబాబు చెల్లించినట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

చంద్రబాబుకి సహకరించడానికి 27 మంది ఇతర సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. అలాంటి సీనియర్ అడ్వొకేట్ సమక్షంలో సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవంతంగా తన వాదనలను ముగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయ‌న మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కావాల్సిన మందులు, ఆహారం అందుతున్నాయన్నారు. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోనికి తీసుకున్నామని.. చట్టం ముందు అందరూ సమానమేనని పొన్నవోలు పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.

AAG Ponnavolu Sudhakar Reddy comments on chandra babu
AAG Ponnavolu Sudhakar Reddy

చంద్రబాబు అనుమతి లేనిదే ఆయన బ్లాక్‌కు ఎవరూ వెళ్లలేరని పొన్నవోలు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పర్యవేక్షణకు డాక్టర్లు అందుబాటులో వుంటారని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఆర్పీసీ చట్టంలో హౌస్ అరెస్ట్ అనేది లేదని.. రాజమండ్రి జైలులో కట్టుదిట్టమైన భద్రత వుందని పొన్నవోలు పేర్కొన్నారు. ప్రైవేట్ హౌస్‌లో ఇంత భద్రత సాధ్యం కాదని.. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదని సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడిందని.. దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ఆధారంగానే ఆయన పేరును చేర్చామన్నారు. ఆయ‌న చేసిన త‌ప్పుల వ‌ల‌నే జైలు బాట ప‌ట్టాడ‌ని, మ‌రి కొంద‌రు అవినీతి కేసులో బ‌య‌ట‌కు రానున్నార‌ని పొన్న‌వోలు చెప్పుకొచ్చారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్ప‌డు ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Tags: AAG Ponnavolu Sudhakar Reddy
Previous Post

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

Next Post

Chandra Babu : చంద్ర‌బాబు నిండా మునిగిన‌ట్టేనా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన సిమెన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Kongara Jaggaiah : ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

by Usha Rani
November 14, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.