YSRCP Audio Leak : ఐప్యాక్ ప్రతినిధికి వైసీపీ నాయకుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో సర్వే కోసం వైసీపీ నాయకుడు రాజన్నకు ఐప్యాక్ ప్రతినిధి ఫోన్ చేశారు. గ్రామంలో అభివృద్ధి, ఓటర్ల వివరాలపై రాజన్న అభిప్రాయాన్ని ఐప్యాక్ ప్రతినిధి అడిగి తెలుసుకోగా, ఆ సమయంలో వైసీపీ నేత చెప్పిన సమాధానం విని షాక్ అవడం ఐప్యాక్ ప్రతినిధి వంతైంది. జగన్ నుంచి మా ఊరికి ఒక్క రూపాయి ఫండ్స్ రాలేదు. గ్రామంలో అభివృద్ధి శూన్యం. వైసీపీలో నాయకులకు గౌరవం లేదు… ప్రతి ఊర్లో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. మరో పది రోజుల్లో భారీగా వైసీపీ వాళ్లు టీడీపీలో చేరుతారు.
వైసీపీ ఉంటుందో ఊడిపోతుందో అర్థం కావడం లేదు. జగన్ మళ్ళీ వస్తే గ్రామాల అభివృద్ధి ఎందుకు… నేను బటన్ నొక్కుతున్నాను కదా అంటాడేమో. జగన్ అడగని వాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి చేయకుండా కేవలం బటన్ నొక్కితే ఓట్లు పడతాయా. అంతో ఇంతో అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయాడు. ఇక్కడ అంతకన్నా ఘోరంగా ఉంటుంది’’ అంటూ వైసీపీ నేత చెప్పినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ ప్రతినిధికి వైసీపీ నేత చెప్పిన విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఐప్యాక్ మోహన్ మాట్లడుతూ.. నమస్తే సార్.. రాజన్న గారా..? నా పేరు మోహన్.. ఐప్యాక్ టీం నుంచి ఫోన్ చేస్తున్నాను అని అనగా, రాజన్న: అవును రాజన్ననే.. చెప్పండప్పా అని అన్నారు. తర్వాత ఐప్యాక్ మోహన్: అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినవి చెప్పినట్టు చేశామా..? ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? అని అడిగారు. దానికి రాజన్న: అభివృద్ధి అంటే.. మా ఊర్లో జరిగిన అభివృద్ధి ఇండియాలో ఎక్కడా జరిగి ఉండదప్పా .. జగనన్న కాలనీలో ఏ ఒక్కరికీ ఒక్క షెడ్డు కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఓ గంప కంకర.. సిమెంట్ రోడ్డు వేయలేదు అని అన్నారు.
ఐప్యాక్ మోహన్: ఏ అభివృద్ధీ జరగలేదా..? అని అడగగా, దానికి జన్న: ఏడిది లేదప్పా.. అభివృద్ధి అనేది అంతా శూన్యం..! రూపాయి పని కూడా జరగలే.. అని అన్నాడు. ఐప్యాక్ మోహన్: వచ్చే ఎన్నికల్లో మెజార్టీ రాదంటారా..? అని అడగ్గా, వానికి రాజన్న: ఒక్కరూపాయి పనికూడా చేయలేదయ్యా.. ఏ పనీ చేయలేదని నీవు ఎమ్మెల్యేను అడిగినా బాధలేదు.. మెజార్టీ వస్తుందో.. ఊడిపోతుందో అర్థం కాకుంది.. జగన్ మళ్లీ గెలిస్తే ఊర్లు వదిలి గట్టున ఉండమంటాడేమో..?రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి పొమ్మాంటాడేమో..? కొళాయి విరిగిపోయిందంటే కొత్తది వేయించేందుకు లేదు.. ఇదా అభివృద్ధి. శ్మశానంలో కాపురం చేయమన్నట్టుంది అయన అభివృద్ధి. మహానుభావుడు చల్లగా నూరేళ్లు బతకనీ.. ఇలాంటి నాయకుడు మనకు దొరకడు.. ఉంటా..అని అంటాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…