YS Vimalamma : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత రంజుగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. జగన్ మరోసారి సీఎం సీటు అధిరోహించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఆయపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా జగన్ గురించి ఆయన మేనత్త వైఎస్ విమలమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుడ్ ఫ్రైడే రోజు ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. జగన్ చాలా భక్తిపరుడు అని చెప్పిన ఆమె జగన్ కోసం శత్రువులు అందరు ఒక్కటయ్యారు. ఆయనని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారు.. అది వినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. మనకు కావల్సింది సుస్థిర పాలన. తప్పులు ప్రతి ఒక్కరిలో చాలా ఉంటాయి.
వెతుకుతే చాలా వస్తుంటాయి. అయితే మనకు కావల్సింది సుస్థిర పాలన. ప్రజలకి ఎంత ఉపయోగంగా ఉన్నారు అనేది మనం చూడాలి. జగన్ ప్రభుత్వం వచ్చాక కరోనా వలన చాలా మంది నష్టం వాటిల్లింది. ఆ సమయంలో జగన్ ముందడుగు వేసి ప్రజలకి చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఇటీవల తాను కలిసినప్పుడు ఏంటి నాన్న శత్రువులు అందరు ఒక్కటయ్యారు ఏమనిపిస్తుంది అని అడగగా ఆ సమయంలో జగన్ ఒకే ఒక మాట మాట్లాడాడు. దేవుని కృప ఉంటే మళ్లీ నాకు అధికారం దక్కుతుంది. దాని గురించి నేనేమి బాధపడడం లేదు అని జగన్ చాలా అద్భుతంగా చెప్పడంతో నాకు చాలా సంతోషం వేసింది అని విమలమ్మ పేర్కొంది.
వైయస్ ఫ్యామిలీ నుంచి వైయస్ వివేకా సొంత సోదరి వైయస్ విమలమ్మ.. కొద్ది రోజుల కిందట మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డి అమాయకుడని.. చిన్ననాటి నుంచి మైల్డ్‌గా ఉండేవాడని.. చెప్పుకొచ్చారు. అలాగే ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రదారులు మాత్రం ప్రస్తుతం నడిరోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతోన్నారని.. ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని వారు మాత్రం జైళ్లలో మగ్గుతోన్నారని ఆమెఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు తన తండ్రి హత్య కేసులో.. తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని… గతంలో వివేకా కుమార్తె వైయస్ సునీత స్వయంగా స్పష్టం చేశారని.. కానీ ఆ తర్వాత.. అదే సునీత.. మాట మార్చారంటూ విమలమ్మ పేర్కొనడమే కాదు, సునీత వెనుక దుష్టశక్తులు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే విమలమ్మ వ్యాఖ్యలపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.