YS Sharmila : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే షర్మిళ కూడా ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ పలువురు వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్నేనాతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్ళులాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని.. ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు.జగన్ మళ్లీ సీఎం కావడం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఆదిమూలం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని అన్నారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే మరోసారి రాష్ట్ర ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారని, ఆయనను సీఎం చేయడానికి జనం చూస్తున్నారని అర్థమవుతుందన్నారు రోజా. ప్రజలకు ఏం చేశాను.. ఏం చేస్తాను అనేవి చెప్పలేని చంద్రబాబు నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నాడని రోజా విమర్శించారు.
అయితే దీనిపై షర్మిళ కూడా ఘాటుగా స్పందించారు. నాపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అలాంటి వారికి మాములుగా ఉండదు అని రోజాకి ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు విసిరింది షర్మిళ. ఇలాంటి తప్పుడు కూతలు కూసే వారికి తర్వాతి రోజుల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదురు కావడం ఖాయం అని షర్మిళ కూల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రోజాపై షర్మిళ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.