YS Sharmila : ఈ రోజు రాఖీ వేడుక పండగ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ప్రతి ఒక్కరు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా సంతోషంగా జరుపుకున్నారు. అయితే ఈ రోజు షర్మిళ తన అన్న జగన్‌కి రాఖీ కట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇంకా జగన్‌పై షర్మిళకి కోపం ఉన్నందునే తాను రాఖీ కట్టలేదని అంటున్నారు. ప్రస్తుతం షర్మిళ కామెంట్స్ వైరల్‌గా మారాయి. టీడీపీకి వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. ఈ అంశంలో సీఎం జగన్ చెల్లెలు, వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ వైసీపీకి పెద్ద దెబ్బగా మారాయి. ఈ కేసు అంశంపై గతంలోనూ స్పందించిన షర్మిల.. ఎన్నడూ ఈ స్థాయిలో కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు.
ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపిస్తుంటే.. వివేకా హత్య కేసుకు ఆస్తులకు సంబంధం లేదని వైఎస్ షర్మిల కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. నిజానికి ఈ కేసు వ్యవహారంలో షర్మిల స్పందించాల్సిన అవసరం లేదు. జగన్ గురించి ఎవరైనా అడిగితే.. వాళ్ల గురించి మాకెందుకు అని సైలెంట్‌గా ఇష్యూను లైట్ తీసుకునే షర్మిల.. కీలకమైన ఈ కేసు విషయంలో మాత్రం వైసీపీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కలకలం రేపింది. షర్మిల కామెంట్స్ కారణంగా వైసీపీని టార్గెట్ చేసేందుకు విపక్ష టీడీపీకి సరికొత్త ఆయుధం, ఉత్సాహం ఇచ్చినట్టు అయ్యిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైఎస్‌ఆర్‌టీసీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని..వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని..కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నిజమని తేలిపోయింది. దీనికి సంబంధించే వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ని గద్దె దింపడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని గతంలో చెప్పిన షర్మిల ఇప్పుడు ఆదే స్టాండ్ మీదున్నారు. రాజశేఖర్ బిడ్డగా తెలంగాణ ప్రజల కోసం తాను ఎప్పుడూ పని చేస్తూ ఉంటానన్నారు. మొదట్నుంచి బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యర్దిగా పెట్టుకున్న షర్మిల సోనియాగాంధీ సమావేశం అనంతరం మాట్లాడిన విధానం కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయమని చెప్పకనే చెప్పినట్లుంది. ఇక కేసీఆర్ కౌంట్‌డౌన్ మొదలైందని ఆమె చెప్పారు.