YS Sharmila : మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు.ఇదే క్రమంలో షర్మిళ ఏపీ రాజకీయాలలో దూరడంతో ఇప్పుడు ఆమె ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. బీజేపీ పార్టీ.. టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ… హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. వీరంతా మోదీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు షర్మిళ. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇక సాక్షి అంశాన్ని ప్రస్తావించిన వైఎస్ షర్మిల.. ఆ సంస్థలో తనకూ వాటా ఉందన్నారు. సోమవారం నాడు వైఎస్ షర్మిల కడప జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు తనపై చేస్తున్న కామెంట్స్, విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. జోకర్ గాళ్లను తనపై ఉసిగొలిపారని, ఎవరు ఏం చేసినా అదిరేది.. బెదిరేది లేదని పేర్కొన్నారు.
జగన్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. రక్త సంబంధమే ఉంది. అయితే, జగన్ సీఎం అయ్యాక మారిపోయాడు. ఇప్పుడున్న ఈ జగన్.. నా అన్న కానే కాదు. వైసీపీలో జగన్ రెడ్డి సైన్యం నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వైసీపీలో రోజుకొక జోకర్ గాడు నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మహిళను అని కూడా చూడకుండా నాపై దిగజారి మాట్లాడుతున్నారు.’ అంటూ వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు షర్మిల.సోనియా గాంధీ వద్దకు అనిల్.. జగన్ భార్య భారతి రెడ్డితో కలిసే వెళ్లారు. వైసీపీ వారికి దమ్ముంటే ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి.’ అంటూ తీవ్రంగా స్పందించారు షర్మిల.