YS Sharmila : అన్నా నా కొడుకు పెండ్లికి రండి అంటూ రేవంత్‌ని ఆహ్వానించిన ష‌ర్మిల‌

YS Sharmila : వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డితో ఈ నెల 18న అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద షర్మిల తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. వైఎస్సార్‌ ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. రీసెంట్‌గా సీఎం రేవంత్‌ రెడ్డిని వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్‌ను కలుసుకున్నారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. . దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాబోయే వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని ఇటీవలే కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అధిష్ఠానం.. ఆమెను ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షరాలిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏపీలో పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. షర్మిలతో భేటీ అయిన కొద్దిసేపటి తరువాతే రేవంత్ కొన్ని కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్యతను సంతరించుకుంది.

YS Sharmila invited cm revanth reddy to her son marriage
YS Sharmila

ఓ తెలుగు ఛానల్ చర్చలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అనేక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల చుట్టూ ఎక్కువగా నడించిందీ బిగ్ డిబేట్. వైఎస్ జగన్ పరిపాలన తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మీదా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్నీ గుర్తు చేసుకున్నారాయన .. ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అపాయింట్ అవుతారని తేల్చి చెప్పారు. ఆమె సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటుందని పరోక్షంగా వెల్లడించారు. త్వరలోనే దీనిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీలో వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని నాయకులను తాము పార్టీలోకి చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago