YS Sharmila : ష‌ర్మిల లాజిక్ మిస్ అయిందా.. ఆమె అనుకున్న‌ది ఒక్క‌టైతే, జ‌రిగేది మ‌రొక‌టా..!

YS Sharmila : జగనన్న వదిలిన బాణం’.. దిశ మార్చుకుని తిరిగి జగన్‌పైకే వెళుతుందా అనే అనుమానాలు అంద‌రిలో మెదులుతున్నాయి. ఏపీలో జగన్‌ను గద్దెదించి, కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేసిన షర్మిల… ‘జగన్‌ పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్‌ ఏ ప్రజా ప్రతినిధినీ కలుసుకోరు. తాడేపల్లి ప్యాలె్‌సకే పరిమితమవుతున్నారు’’ అని చెప్పారు. ఇక… తన రాజకీయ ఆకాంక్షలపై జగన్‌ నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైలు పాలైనప్పుడు రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని నిలబెట్టానని షర్మిల వివరించారు.

పన్నెండేళ్ల కిందట తన అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆయన స్థాపించిన పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల, ఆ తరువాత సొంతంగా పార్టీ స్థాపించి చేసిన రాజకీయ ప్రయాణంలో ఇదొక కొత్త మలుపు.‘‘చనిపోయిన నా తండ్రిని ఏ1 నిందితుడిగా పేర్కొన్న దుర్మార్గులు’’ అంటూ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను తిట్టిన షర్మిల మళ్లీ అదే పార్టీలో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఆపడం కోసమంటూ, తాను పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.

YS Sharmila how she missed the logic
YS Sharmila

తెలంగాణలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు తమ చలవేననీ, తాము పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ దాదాపు 35 స్థానాల్లో గెలిచిందనీ షర్మిల మీడియా ముందు చెప్పారు. షర్మిల నిర్ణయాన్ని ఆ పార్టీలో పనిచేసిన కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న వంటి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల మార్పు గురించి చర్చ మొదలైంది.అటు జగన్‌తో పనిచేయలేక, ఇటు తెలుగుదేశం, బీజేపీ వంటి పార్టీల్లో చేరలేక ఉండిపోయిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితుల్లో, షర్మిల రాక ఆసక్తి కలిగిస్తోంది.మొదట్లో కాంగ్రెస్‌ను విమర్శించి, తన అన్నలాగే వైఎస్సార్‌టీపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక శక్తి అన్న భావన కలిగించారు షర్మిల. ఇప్పుడు ఏపీలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందన్న దానితో సంబంధం లేకుండా ఆమె రాకను జగన్ వ్యతిరేకులు, టీడీపీ అనుకూల వర్గాలు పండగ చేసుకుంటున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago