YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్‌గా జగన్ మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో గుంటూరు జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన జైలు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పలువురు కార్యర్తలు ఆయనతో సెల్పీలు దిగారు. ఈ క్రమంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా జగన్‌తో సెల్ఫీ దిగడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. అదే కారాగారంలో పని చేస్తున్న అనంతపురానికి చెందిన అయేబాని మధ్యలోకి జగన్ తీసుకొచ్చి సెల్ఫీలు దిగడం హాట్ టాపిక్ అయింది.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపు పాలన చూడలేదని, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, నందిగం సురేష్‌ను అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారని విమర్శించారు. విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకే, నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వాస్తవాలు తెలియవా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడు నెలల పాలన చాలా దారుణంగా ఉందని, రెడ్‌బుక్ పాలనపై దృష్టిపెట్టారని జగన్ విమర్శించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పాలనపై మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎన్నడూ చూడలేదని ఎద్దేవా చేశారు. వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగం సురేశ్‌ను, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
విజయవాడ వరదలు ప్రభుత్వ వైఫల్యమేనని.. సీఎం చంద్రబాబు కారణంగానే 60 మంది చనిపోయారని ఆరోపించారు. ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పట్టాభి తనను బూతులు తిట్టారని, అందుకే పార్టీ అభిమానులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ అభిమానులతో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారని, అప్పుడు టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండొచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.