Chandra Babu : ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాలలో పెను మార్పులు తీసుకొచ్చారు. ఏపీ రాష్ట్రం సపరేట్‌గా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలనే కసితో ఉన్నాడు. అయితే ఇటీవల చంద్రబాబుపై పలు దాడులు జరుగుతుండం మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన హత్యకు సీఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు కుట్ర చేశారని మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ రాజా నగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరిలు ఇటీవల ఆరోపించారు.
చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై వాస్తవాలు బహిర్గతం చేసేందుకు పర్యటిస్తుంటే ప్రజలను నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని దానిని చూసి తట్టుకోలేక పెద్దిరెడ్డి అనుచరులతో హత్యకు కుట్రచేశారని అన్నారు. వైసీపీ గూండాలు దాడి చేస్తే తిరిగి చంద్రబాబుపై కేసు పెట్టడం దుర్మార్గమని, దీనిని టీడీపీ ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ వ్యవహారంలో పుంగనూరు ఎస్పీని సస్పెం డ్ చేయాలని డిమాండు చేశారు. జగన్ చేసిన కుట్రలో భాగస్వాములుగా ఉన్న అధికారులు భవిష్యత్‌లో అతనితోపాటు జైలు కెళ్లి చిప్పకూడు తినడం ఖాయమన్నారు.
అయితే చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగే చాన్స్ ఉండడంతో ఆయనకి సెక్యూరిటీ భారీగా ఉంటుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చంద్రబాబుకు జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) గార్డులతో భద్రత ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలుమార్లు చంద్రబాబుకు ఉన్న పోలీసు భద్రతను తగ్గించేందుకు ప్రయత్నించగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించి మరీ భద్రత కొనసాగింపు తెచ్చుకున్నారు. తిరుపతిలో ఆయనపై నక్సలైట్లు దాడి చేసిన తర్వాత .. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రతను కల్పించింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సెక్యూరిటీని మరింత పెంచారు. ఒక్క షిఫ్ట్‌కు పన్నెండు మంది కమెండోలు ఆయనకు రక్షణగా ఉంటారు. రెండు షిఫ్టుల్లో ఇరవై నాలుగు మంది కమెంటోలు అత్యాధునిక ఆయుధాలతో రక్షణ కల్పిస్తారు.