Yashasvi Jaiswal : ఐపీఎల్‌ య‌శ‌స్వి.. రాజ‌మౌళి విక్ర‌మార్కుడులో న‌టించాడా..?

Yashasvi Jaiswal : ప్ర‌స్తుతం ఐపీఎల్ ఫుల్ స్వింగ్‌లో న‌డుస్తుంది. అయితే ఈ సీజ‌న్ లో యువ క్రికెటర్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు య‌శ‌స్వి జైస్వాల్. రాజ‌స్తాన్ త‌ర‌పున ఎక్కువ పరుగులు సాధించ‌న ఆట‌గాడిగా రికార్డు న‌మోదు చేసుకున్నాడు య‌శ‌స్వి. ముంబైకి చెందిన యశస్వి నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఎంతో కష్టపడి క్రికెటర్ గా మారాడు. పానీపూరి బండి వద్ద పని చేసుకున్న యశస్వి ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి దూసుకు వెళ్తున్నాడు. ఆయ‌న జోరు చూస్తుంటే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ లో మ‌నోడు ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

అయితే ఐపీఎల్ లో తెగ సందడి చేస్తున్న జైస్వాల్ కు అభిమాన పేజీలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇదే సమయంలో మీమ్స్ తో కూడా జైస్వాల్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో యశస్వి యొక్క సందడి అంతా ఇంత లేదు. తాజాగా ఒక మీమ్ ఎక్కువ మంది దృష్టిని తెగ‌ ఆకర్షిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకుని అందులోని బుడ్డోడు ప్రస్తుత స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ క్రియేట్ చేశారు. విక్రమార్కుడు సినిమాలో రేయ్ సత్తీ బాల్ ఇటు వచ్చిందా అంటూ ఒక కుర్రాడు రవితేజను పిలిచి అడగ‌డం మ‌నం చూసే ఉంటాం.

Yashasvi Jaiswal did he acted in vikramarkudu movie or not
Yashasvi Jaiswal

అయితే అప్పుడు పిల్లాడిని లోనికి తీసుకు వెళ్లి రవితేజ కొడతాడు. ఆ సన్నివేశం ఇప్పటికి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ సీన్ లో కుర్రాడు మరెవ్వరో కాదు యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ లో చెబుతున్నారు. దాంతో చాలా మంది కూడా నిజమే అయ్యి ఉంటుందని అనుకున్నారు. కానీ చూడ్డానికి కాస్త పోలికలు అలాగే ఉన్నాయి కానీ విక్రమార్కుడు సినిమాలో కనిపించిన కుర్రాడు యశస్వి కాదు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago