Yash : వరుస ఫ్లాపుల తర్వాత సలార్ చిత్రంతో అతి పెద్ద హిట్ కొట్టాడు ప్రభాస్. ఆయనకి బాహుబలి సినిమాతోనే మంచి ఇమేజ్ దక్కింది. ఇక ఇప్పుడు సలార్‌తో రెట్టింపు అయింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక్క సినిమాతో ఇంత రైజ్ ఎవరు చూసి ఉండరేమో. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్కో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని సలార్ నిరూపించింది. ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే 180 కోట్లు, రెండు రోజుల్లో 300 కోట్లు వసూళ్లు సాధించడం అంటే మాటలు కాదు.
నార్త్ అమెరికాలో సోలో హీరో సినిమాతో ఐదు మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా సలార్ తో మరోసారి ప్రభాస్ రికార్డు నెలకొల్పాడు. బాహుబలి 1, 2.. సాహో చిత్రాలతో ఘనత సాధించిన ప్రబాస్ ఇప్పుడు సలార్‌తోను ప్రత్యేక రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం సలార్ మానియా దేశమంతటా ఉంది. అయితే సలార్ ఇంత విజయం సాధించడం పట్ల ప్రభాస్‌ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తుతున్నారు. రీసెంట్‌గా ప్రభాస్ ఇంటికి యష్ వచ్చి అభినందించినట్టు తెలుస్తుంది.ఇద్దరు కలిసి తెగ రచ్చ చేశారు. సలార్ రిలీజైన రోజు థియేటర్‌లో చూసిన యష్ టీం అందరిని అభినందించాడు.ఇక పని మీద హైదరబాద్ వచ్చిన యష్.. ప్రభాస్ ఇంటికి వెళ్లి ఆయనని కలిసాడట.
ఇక ప్రభాస్ ఆతిథ్యంతో ఫుల్ ఖుష్ అయ్యాడట యష్.ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్‌తో పాటు యశ్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాని తీరా చూస్తే అందులో యష్ కనిపించలేదు. మరి సెకండ్ పార్ట్‌లో అయిన యష్ కనిపిస్తాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…