Yarlagadda Lakshmi Prasad : నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు నెక్లెస్‌రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ సోదరులు నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్-జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులకు సూచించడంతో వారు మరోమారు ఆలోచించకుండా తీసి రోడ్డున పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాలయ్య ప్రవర్తనపై నందమూరి ఎన్టీఆర్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తన ఏం బాగోలేదు అంటూ కామెంట్ చేశారు. అయితే ఎన్టీఆర్ విషయంలో బాలయ్య ప్రవర్తించిన విధానం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.

తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదని చెప్పారు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టమని యార్లగడ్డ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. సందర్భంగా యార్లగడ్డ నారా లోకేష్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ కూతురిని లోకేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని తాను చంద్రబాబును అడిగానని చెప్పారు. దీనిపై ఆయన సీరియస్‌గా స్పందిస్తూ.. ‘నాన్సెన్స్’ అని చంద్రబాబు తనతో అన్నారని తెలిపారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని ఆ సందర్భంగా ఆయన చెప్పారని వివరించారు. అయితే ఆ తర్వాత లోకేష్‌కి బాలకృష్ణ కూతురిని ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని ఆయన గుర్తుచేశారు.