TDP : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 11తో ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. 13న పోలింగ్ ఉంటుంది. అయితే ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో వైసీపీకి కొన్ని,కూటమికి మరికొన్ని జై కొట్టాయి. ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ట్రాకర్ పోల్ పేరుతో జనవరి 16 నుంచి 21వ తేదీ మధ్యకాలంలో 35 పోలింగ్ స్టేషన్ల నుంచి 700 శాంపిల్స్ సేకరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20 శాంపిల్స్ చొప్పున తీశారు. ఇందులో 53 శాతం పురుషులు కాగా 47 శాతం మహిళలున్నారు.
ఎస్టీలు 45 శాతం కాగా, ఓబీసీలు 30 శాతం, ఓసీలు 15 శాతం ఎస్సీలు 6 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని 7 ఎస్టీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే అధికార పార్టీకు కాస్త ఇబ్బందిగానే కన్పిస్తోంది. ప్రతిపక్షాలు సంఘటితమైతే అధికార పార్టీకు ఇబ్బందిగా మారవచ్చు. ప్రతిపక్షాలు ఒంటరి పోరాటం చేస్తే మరోసారి వైసీపీదే ఆధిక్యం కానుంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఈసారి దాదాపు 5 శాతం ఓట్లను కోల్పోనుంది. అదే సమయంలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే పోల్ పల్స్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీది సర్వేలో పొందుపరిచారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 51.2 శాతం ఇచ్చారు. వైసీపీకి 42.8 ఇచ్చారు. కాంగ్రెస్‌కి 3.6 శాతం ఓట్ శాతం షేర్ ఉంది. ఇతరులు 2.4 శాతం షేర్ ఉంది.
అయితే ఎవరిని భాగస్వామ్యులని చేసి ఈ ఓట్ శాతం ఇచ్చారు అంటే విద్యార్ధులు వైసీపీకి 36.8, కూటమికి 54.8, ఇతరులకి 8.4, ఫార్మల్స్ చూస్తే వైసీపీకి 46.3, కూటమికి 51.5, బిజినెస్ పీపుల్ వైసీపీకి 51.2, కూటమి 56.4, అన్ ఎంప్లాయి వైసీపీ వైపు 42.5, కూటమికి 54.3 అనుకూలంగా ఉన్నారు. అయితే అందరు కూడా కూటమి వైపే అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్యాస్ట్ సర్వే ప్రకారం కూడా సర్వే చేశారు .రెడ్డి వైసీపీకి 72.3, కూటమికి 24.5 ఇచ్చారు. కాపు వైసీపీకి28.6,కూటమికి 68. శాతం. కమ్మ వైసీపీకి 18.2 శాతం. కూటమికి 72 శాతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కులం పరంగ చూసిన కూడా కూటమికే ఎక్కువ మొగ్గు చూపినట్టు అర్ధమవుతుంది.