Athadu Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో కామెడీ ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. ఇందులో మహేష్ బాబు హీరోయిజం ఒక ఎత్తు అయితే.. త్రివిక్రమ్ మాటలు, ఆయన రాసుకున్న కథలోని ఎమోషన్, కామెడి మరో ఎత్తు. థియేటర్లలో అంతపెద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయిన ఈ సినిమా.. బుల్లితెరపై మాత్రం విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబును తప్ప మరొకరిని హీరోగా అనుకోలేం అన్నట్టు చిత్రం సాగింది.
థియేటర్లలో అంతపెద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయిన ఈ సినిమా.. బుల్లితెరపై మాత్రం విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందుగా మహేష్ బాబుకి కాకుండా ఉదయ్ కిరణ్ చెంతకి చేరింది. ఆ విషయాన్ని నటుడు మురళీ మోహన్ వెల్లడించారు. ఏడాది క్రితం ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. ‘అతడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఉదయ్ కిరణే అనుకున్నాం.
సినిమా ఫైనలైజ్ అయ్యే టైమ్‌కి చిరంజీవి గారి అమ్మాయితో పెళ్లి అనినుకోవడం, ఇక నుంచి మీరు ఏ సినిమాలు ఒప్పుకోవాలో మేం చూసుకుంటాం అని ఉదయ్ కిరణ్ డైరీని వాళ్లు తీసుకోవడం, అరవింద్ గారు చూసుకోవడం.. ఇలాంటివి ఏవో జరిగాయి. అంతకు ముందు మా సినిమా చేస్తానన్నాడు.. కానీ మేం డేట్లు అడిగేసరికి ఏదో కన్‌ఫ్యూజన్‌లో పడి.. అయ్యో వేరేవాళ్లకు డేట్లు ఇచ్చేశామండి.. ఇప్పటికిప్పుడు అయితే కుదరదు, వచ్చే ఏడాది అయితే కుదురుతుంది అన్నాడు. సరే ఓకే బాబు అన్నాం.. వెంటనే అనుకోకుండా మహేష్ బాబు దగ్గరికి వెళ్లింది’ అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా ఉదయ్ కిరణ్.. ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.