Virupaksha : మొగలిరేకులు’ సీరియల్‌లో దుర్గ క్యారెక్టర్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు రవి కృష్ణ. ఆ తర్వాత వరూధుని పరిణయం, శ్రీనివాస కల్యాణం, మనసు మమత, బావా మరదళ్లు, ఆమె కథ.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతనికి బిగ్ బాస్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ షోలోకి వెళ్లాక రవికృష్ణ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు మంచి అబ్బాయిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇక ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాలో భైరవ్/కుమార్ పాత్రలో మెరిసి అందరికీ షాకిచ్చాడు.
విరూపాక్ష సినిమా చూసిన ఆడియన్స్ అయితే ఈ క్యారెక్టర్‌ను చూసి అవాక్కయ్యారు. అందులోనూ ఒకప్పుడు బూరి బుగ్గలు వేసుకొని అమాయకమైన హీరోలా సీరియల్స్‌లో కనిపించిన రవి.. ఇలా మారిపోయేసరికి నిజంగానే షాకయ్యారు. అయితే ఈ పాత్రకు ముందుగా రవికష్ణ బదులు వేరే నటుడిని సంప్రదించారట. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికృష్ణ మాట్లాడుతూ మొదట తను పోషించిన పాత్ర కోసం కార్తీక్ ను సంప్రదించారని తెలిపారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో కార్తీక్ కి డేట్ల విషయంలో సమస్య రావడంతో ఆ పాత్ర కోసం నన్ను ఎంపిక చేయడం జరిగిందని రవికృష్ణ స్పష్టం చేశారు.

విరూపాక్ష సక్సెస్ తో రవికృష్ణకు సినిమా ఆఫర్లు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నటుడు సీరియళ్లకు దూరంగా ఉంటూ సినిమాలలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించిన రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ తో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పాలి. ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విరూపాక్ష చిత్రం మరికొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది . ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌కి కూడా మంచి బూస్టప్ వచ్చినట్టు అయింది.