సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోగా, దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు చెప్పుకొచ్చారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించామని వారు పేర్కొన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని కూడా చెప్పారు. కాస్త ముందుగా సీపీఆర్ చేసి ఉంటే ఆయన పరిస్థితి విషమంగా ఉండేది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు.
అయితే గత 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తిరిగి వస్తారని అనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకునేలోపు ఇలా జరిగిందని అభిమానులు బాధపడుతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన చివరి మాటలను అభిమానులు గుర్తుచేస్తున్నారు. తారకరత్నతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల అనుబంధం గురించి ప్రత్యేకం అని చెప్పాలి. ముఖ్యంగా తారకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
కుప్పం పర్యటనలో భాగంగా తారకరత్నమాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ నా తమ్ముడే కదా, జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు.ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ, నందమూరి రక్తం, నా తమ్ముడు. ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడు. అన్నకి తమ్ముడి మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది’ అని ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తన మాటల్లో వెల్లడించారు తారకరత్న. ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన ఆఖరి మాటలు కావడంతో అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఇంత మంచి మనిషి ఇలా అందరిని వదిలి వెళ్లడం బాధగా ఉందని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…