Meena : ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన అందాల నటి మీనా.. కొన్నాళ్ల తర్వాత ఈ భామ స్టార్ హీరోయిన్‌గా మారింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి దక్షిణాది స్టార్ హీరోలతో జోడి కట్టి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా సుమారు మూడు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన మీనా మంచి హిట్స్ దక్కించుకున్న సమయంలో వ్యాపార వేత్త విద్యాసాగర్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి నైనికా అనే పాప ఉంది. ఎంతో ఆనందంగా సాగుతున్న మీనా జీవితంలో గతేడాది తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా కాలమే పట్టింది అని చెప్పాలి. అయితే ఇదే సమయంలో మీనాపై కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. మీనా మళ్లీ పెళ్లి చేసుకోనుందని పుకార్లు షికార్లు చేశాయి. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోన్న మీనా మరోసారి తన రెండో పెళ్లి వార్తలపై స్పందించింది. అలాగే తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సాగర్ లేడనుకుని..అప్పుడప్పుడే కోలుకుంటున్న సమయంలో ఓ రూమర్ హల్ చల్ చేసిందన్నారు. తనకు ధనుష్ తో రెండో పెళ్లి అన్నట్లు పుకార్లు పుట్టించారు. ‘ ధనుష్.. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఒంటరిగా ఉండటంతో.. అతడితో పెళ్లి జరుగుతుందని రూమర్స్ చేశారు. చాలా కోపం వచ్చింది. లేనిపోని ఎందుకు పుట్టిస్తారు.
ఒక్క మాట అడగొచ్చు కదా.. లేదు నేను చెబుతా కదా. మా కుటుంబం కూడా సఫర్ అయ్యింది. మా అత్తయ్య కూడా బాధపడింది. సెన్సేషనల్ కోసం ఏదో ఒకటి రాసేస్తున్నారు. ఆయన చనిపోవడంతో వెంటనే ఈ రూమర్ వచ్చింది. నిజం ఉంటేనే రాయండి..ఏదో ఎవరో చెప్పారని రాసేస్తున్నాను. ఎందుకు మహిళల్నే టార్గెట్ చేస్తుంటారు’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అన్నారు. రేపే ఏమౌతుందో చెప్పలేనన్నారు. చిన్నప్పుడు అలరించిన మీనా.. టాప్ హీరోయిన్ గా మారి.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…