KCR : తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కేసీఆర్‌ని ఓడించి రేవంత్ రెడ్డి గద్దె ఎక్కాడు. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు దారి తప్పుతున్నాయి. భాష గీత దాటిపోతోంది. మార్పు వచ్చిందని ఆశిస్తున్న ప్రజలకు నిరాశే కలుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. ఇక అలాంటి లాంగ్వేజ్ కు చోటు ఉండదని అనుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి అదే లాంగ్వేజ్ ప్రయోగించారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత … కూడా అదే భాషను కంటిన్యూ చేస్తున్నారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్‌ని దారుణంగా ఓడించి బుద్ది చెప్పారు.
అయితే కేసీఆర్ అంతటివాడిని రేవంత్ రెడ్డి ఓడగొట్టారనే విషయం మరిచిన కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు రేవంత్‌ని ఇబ్బందులు పెడుతున్నామనే భావనలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకపోయినా, రేవంత్ రెడ్డి దూకుడు, వ్యూహాలను, వైఫల్యాలను నిశితంగానే పరిశీలిస్తున్నారు. కవిత జైలు నుండి బయటకు వచ్చాక కేసీఆర్ దూకుడికి బ్రేక్ ఉండదు అని చెప్పాలి. ఇక కేసీఆర్ వలన ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డి కూడా గ్రహించిన్నట్లు భావించవచ్చు. అందుకే కాంగ్రెస్ మంత్రులు కోరుకుంటున్న స్వేచ్ఛ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి తన క్యాబినేట్‌ని జాగ్రత్తగా కాపాడుతున్నట్టు అర్ధమవుతుంది.
మరోవైపు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వాటిని ఎదుర్కోగలరా?అనే సందేహం కలుగుతుంది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తోడ్పాటు తీసుకుంటే కాస్త గట్టెక్కే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అభినందనలు తెలిపి విభజన సమస్యలపై చర్చలకు ఆహ్వానించారని అనుకోవచ్చు. తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ఉండటం చంద్రబాబు నాయుడుకి ఎంత ముఖ్యమో, అదేవిదంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుగా ఉండటం రేవంత్ రెడ్డికి కూడా అంతే అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.