Vishwaksen : బాల‌కృష్ణ ఈవెంట్‌లో మందు తాగాడా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన విశ్వ‌క్ సేన్..

Vishwaksen : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తనతో సెల్ఫీలు దిగేందుకు , షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చే వారిపై చేయి చేసుకోవడం ఆయ‌న‌ని లేనిపోని వివాదాల‌లోకి దూరేలా చేస్తుంటుంది. సొంత అభిమానులే ఈ విషయంపై బాలకృష్ణను తప్పుబడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా నటసింహం మరో వివాదంలో చిక్కుకున్నారు. ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ సినిమా ప్రీ విడుదల వేడుకలో బాలకృష్ణ, నటి అంజలిని నెట్టేస్తున్నట్టుగా వున్న వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది ఆ వీడియో ముందు, వెనకాల తీసేసి కేవలం బాలకృష్ణ, అంజలిని పక్కకి నెట్టేస్తున్న భాగం మాత్రమే చూపిస్తూ, బాలకృష్ణకి మహిళల పట్ల గౌరవం లేదని ట్రోల్ చేస్తున్నారు.

అయితే చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ అక్కడ జరిగింది వేరు, చూపించేది వేరు అని చెపుతూ బాలయ్యపై ట్రోల్స్ ఆపాలని చెప్పారు.. సభ్యులు అందరితో కలిసి బాలకృష్ణ ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో నటి అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి సరిగా వినిపించుకోలేదు. దీనితో బాలకృష్ణ ఆమెను పక్కకు నెట్టారు. అంజలి షాక్ అయినా, తరువాత ఆ విషయాన్ని సరదాగా తీసుకొని నవ్వేసింది కూడా, బాలకృష్ణతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. అయితే కొంతమంది ఈ విషయం గురించి వివాదం చెయ్యాలని అనుకున్నారేమో, అందుకని ఈ వీడియో ముందు, వెనకాల తీసేసి, కేవలం బాలకృష్ణ, అంజలిని నెట్టడం వరకే చూపిస్తూ, బాలకృష్ణకి మహిళలంటే గౌరవం లేదని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.

Vishwaksen reaction on balakrishna drinking in the event
Vishwaksen

ఈ ఈవెంట్‌కు బాలయ్య మందు తాగి వచ్చారని, ఆయన సీటు పక్కన మద్యం బాటిల్‌ను హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మద్యం బాటిల్ నిజం కాదని.. మంచినీటి సీసాలో మందు ఉన్నట్లు సీజీ చేసి బాలకృష్ణను ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఈ ఈవెంట్‌లో ఉన్నామని.. అక్కడేం జరిగిందో మాకు తెలియదా అని నాగవంశీ ప్రశ్నించారు. అలాగే అంజలి ఇష్యూపైనా ఆయన స్పందించారు. మరి వీరిద్దరి క్లారిటీతోనైనా వివాదం సద్దుమణుగుతుందా లేక మరో కొత్త పాయింట్ పట్టుకుని గోల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago