Vishwak Sen Mukhachitram : “కలర్ ఫోటో” సినిమాకి జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ రచయితగా ఇప్పుడు “ముఖచిత్రం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా, ఈ సినిమాకి యువ డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వం వహించారు. ఇందులో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని హీరో హీరోయిన్లుగా నటించగా విశ్వక్ సేన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా మంచి అంచనాల మధ్య విడుదల కాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
రాజ్ కుమార్ (వికాశ్ వశిష్ట) ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ కాగా, అతని తల్లి ఆక్సిడెంట్ లో తన అందాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోయి చనిపోతుంది. దీంతో ఇంకెవరు అలా చనిపోకూడదనే రాజ్ కుమార్ ప్లాస్టిక్ సర్జన్ అవుతాడు. అయితే మహతి (ప్రియా వడ్లమని) అనే ఒక పల్లెటూరు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా , తన క్లాస్మేట్ మాయ (ఆయేషా ఖాన్) రాజ్ ను ప్రేమిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు మాయా కి ఆక్సిడెంట్ కావడంతో ఆమె ముఖం చిధ్రమైపోతుంది. అదేరోజు మహతి కూడా ప్రాణాలు కోల్పోతుంది. దీంతో తనకి ఎంతో ఇష్టమైన భార్య ముఖాన్ని మాయా కి ప్లాస్టిక్ సర్జరీ చేసి మాయ ని మహతిగా మారుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రాజ్ గురించి మహతి రూపం లో ఉన్న మాయా ఎలాంటి నిజాలు తెలుసుకుంది? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
ఇదివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన ప్రియా వడ్లమానికి యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ దొరికిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లో అమాయకమైన అమ్మాయిగా, సెకండాఫ్‌లో ఆధునిక యువతిగా రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ అద్భుతంగా చూపించింది. రాజ్‌కుమార్‌గా వికాస్ వశిష్ట పాజిటివ్ యాంగిల్‌లో కనిపించే నెగెటివ్ రోల్‌లో ఒదిగిపోయాడు. హీరో ఫ్రెండ్‌గా చైతన్యరావ్‌కు మంచి క్యారెక్టర్ దక్కిందనే చెప్పాలి. అయేషాఖాన్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో లాయర్‌గా గెస్ట్ రోల్‌లో విశ్వక్‌సేన్ నటించాడు. కాకపోతే ఆ క్యారెక్టర్ అతనికి పెద్దగా సెట్ కాలేదు.
సందీప్ రాజ్ అందించిన కథ నిజంగానే సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. డైలాగులు కూడా చాలా బాగున్నాయి. కథని డైరెక్టర్ గంగాధర్ కూడా అంతే బాగా తెరకెక్కించారు. శ్రీనివాస్ బెజూగం సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. అతను అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక సినిమాలోని ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
- గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
- రన్ టైం
మైనస్ పాయింట్స్:
- బలహీనతలు
- ఫస్ట్ హాఫ్
చివరిగా..
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన విభిన్నమైన ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ముఖచిత్రం సినిమాను మనం చూడవచ్చు.. ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ తప్ప మిగిలిన వాటిలో కొత్తదనం కొంత వరకు మిస్సయిందనే చెప్పాలి. సినిమా కొంత కన్ఫ్యూజ్ చేసినప్పటికీ ఆకట్టుకుందని చెప్పక తప్పదు.