Vishnu Priya Gangulu Song : జ్యోతి కున్నూరు నిర్మాత గా భీమ్స్ సిసిరిలియో సంగీత సారథ్యంలో ప్రముఖ కోరియెగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వంలో మానస్ , విష్ణు ప్రియ నర్తించిన ‘గంగులు’ ఫోక్ సాంగ్ తాజాగా విడుదలైంది. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్,పద్మిని నాగులపల్లి, ప్రముఖ యాంకర్ , హీరోయిన్, నిర్మాత జయతి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై సాంగ్ ను విడుదల చేశారు. తెలుగు తనం ఉట్టి పడేలా స్వచ్ఛమైన తెలుగు పదాలతో తరుణ్ సైదులు రాసిన లిరిక్స్ కు స్వరాజ్ కీర్తన్ .. అంతే వినసొంపుగా చాలా బాగా పాడాడు.
ఈ పాటకు భీమ్స్ సిసిరిలియో అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా పాటకు తగ్గట్టే సాయి శ్రీ రామ్ కూడా చాలా చక్కటి విజువల్స్ ఇచ్చాడు. శ్రష్టి వర్మ కోరియోగ్రఫీ లో వచ్చిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది. అయితేఈ పాటకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల మానస్ మాట్లాడుతూ ‘ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీరామ్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారని అన్నాడు.. స్వచ్ఛమైన తెలుగు పదాలతో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు.. ‘మానస్‌తో కలిసి ఇంతకుముందు చేసిన ‘జరీ జరీ పంచె కట్టు’ పాటకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ‘గంగులు’ పాట కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.
ఈ సాంగ్ గురించి యాంకర్, హీరోయిన్, నిర్మాత, జయతి మాట్లాడుతూ… ఇంతకు ముందు మానస్, విష్ణు ప్రియలు చేసిన జరీ జరీ పాట చితి పాపులర్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలో మానస్, విష్ణు ప్రియ ల డాన్స్ చాలా చూడముచ్చటగా ఉందని పేర్కొంది. లిరిక్ రైటర్ తరుణ్ సైదులు ముందుగా ఈ పాటను బీమ్స్ అన్నకు పంపగా, ఆయన ఇది చాలా బాగుందని చెప్పడంతో జ్యోతి ,భీమ్స్, సాయి శ్రీరామ్ మానస్, విష్ణు ప్రియ ,ఇలా అందరూ కలసి ఈ పాటకు ప్రాణం పోశారు వారందరికీ నా ధన్యవాదాలు అని సైదులు స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…