Virupaksha : దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత సాయి ధరమ్ విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. మూవీ చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో మిస్టిక్ థ్రిల్లర్ గా విరూపాక్ష చిత్రం రూపొందగా, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను రాబడుతూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం లాబాల బాట పడుతుంది.
విరూపాక్ష చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే .. ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణులు కారణంగా బడ్జెట్ కొంత ఎక్కువగానే అయింది. మొత్తంగా ఈ సినిమాను 44 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లు, నాన్ థియేట్రికల్ 29 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రానికి ఓవరాల్ బిజినెస్ 54 కోట్లు నమోదైంది. అయితే గత నాలుగు రోజుల విరూపాక్ష చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకుపైగా గ్రాస్, రెండో రోజు 13 కోట్ల గ్రాస్, మూడో రోజు 12.5 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 7 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ఈ చిత్రం 50 కోట్ల కలెక్షన్ల మైలురాయిని నమోదు చేసింది.
అయితే 4వ రోజుతో పోల్చితే ఐదో రోజ దాదాపు 10 శాతం కలెక్షన్లు క్షీణించాయి. ఈ చిత్రం 5 వ రోజు బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 55 కోట్లకు చేరువైంది. ఈ సినిమా కేవలం 5వ రోజు లాభాల జోన్‌లోకి ప్రవేశించడం విశేషంగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి విజయం సాధించిన చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. తేజ్ గతచిత్రం ‘రిపబ్లిక్’ బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సీరియస్ సబ్జెక్ట్ కావడం వల్ల పెద్దగా ఆడలేదు. కాని ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.