Virat Kohli Restaurant In Hyderabad : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వస్త్రాలతోపాటు రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కోహ్లీ.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించాడు ..హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను మే 24న ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తన ఇన్ స్టాలో వెల్లడించారు.
మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాను. మేము ఇప్పటికే హైదరాబాదద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం.. నాకు, one8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు . ఇది హైదరాబాద్‌లోనే ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని అన్నారు. మొదటగా బెంగళూరులో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాం..ఇపుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశామని కోహ్లీ బిజినెస్ పార్ట్ నర్ వర్తిక్ తిహార్ చెప్పాడు. కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని..ఇటీవలే ఆర్సీబీ తరపున మ్యాచులు ఆడాడాని.. వీలైతే మరి కొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడని తెలిపారు.
వన్ 8కమ్యూన్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని చెప్పారు.ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యాని ఉంటుందన్నారు.కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ అతడికి ఇష్టమని అన్నారు. విరాట్ రెస్టారెంట్ ను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక వన్ 8 కమ్యూనల్ రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని తెలిపారు. కోహ్లీకి మష్రూమ్ డిమ్ సమ్ అంటే ఇష్టమని కోహ్లీ బిజినెస్ పార్ట్నర్ నర్ వర్తిక్ తీహార్ తెలిపారు.కాగా కోహ్లీ విషయానికి వస్తే ప్రస్తుతం టీ20 ప్రపంచ్ కప్ కోసం ప్రాక్టీసులు చేస్తూ బిజీగా ఉన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…