Viral Video : రోజు రోజుకి సిటీలలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు.. అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. కఠిన నిబంధనలు కూడా పెడుతున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు కఠిన చర్యలతో ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. అయితే.. ఇన్ని చర్యలు తీసుకున్నా.. కఠిన నిబంధనలు పెట్టినా.. కొందరు వాహనదారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్న వారి వల్లే.. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.
రాంగ్ రూట్లలో వెళ్లే వారి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గుర్తించిన పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిని డైరెక్టుగా జైలుకు పంపించేందుకు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై.. 336 సెక్షన్ కింద కేసు కూడా ఫైల్ చేస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా చార్జిషీట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అయిన కూడా కొందరికి భయం అనేది లేకుండా పోయింది. ఇష్టమోచ్చినట్టు రాంగ్ రూట్‌లో వెళుతున్నారు.

తాజాగా ఓ వ్యక్తి అంబులెన్స్‌కి ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చారు. అంతేకాదు పొగరుగా సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో ఆర్మీ వ్యక్తి వచ్చి గట్టిగా వాహనదారుడికి క్లాస్ పీకాడు. కోపంతో హెల్మెట్‌పై ఒక్కటి వేశాడు. దెబ్బకి దారిలోకి వచ్చాడు .కాస్త సైలెంట్‌గా ఉన్నాడు. కాస్త ఓవర్‌గా మాట్లాడుతుండే సరికి తన వాహనంలో నుండి లాఠిని కూడా తీసి గట్టిగా వేద్దామనుకున్నాడు ఆర్మి. దాంతో సైలెంట్ అయిపోయాడు. ఇక అదే సమయంలో లేడి పోలీస్ కూడా అక్కడికి వచ్చింది. మీరు ఆగండి సర్ నేను చూసుకుంటాలే అని ఆమె అతడికి బుద్ది చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Satisfying videos road rage version pic.twitter.com/LSETqhvU0K
— Madhur (@ThePlacardGuy) August 25, 2024