Viral Video : అడివికి రారాజు సింహం. దానిని చూస్తే ఏ జంతువుకి అయిన హడల్. మనుషులు సైతం సింహం గాండ్రింపుకే భయపడతారు. చేతిలో గన్ ఉన్నా, ఇతర ఆయుధం ఉన్నా కూడా సింహం ఎదురెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అయితే గుజరాత్‌కి చెందిన ఓ రైతు చేతులో ఎలాంటి ఆయుధం లేకపోయిన కూడా ధైర్యంగా సింహానికి ఎదురెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో చోటుచేసుకోగా.. స్థానిక బీజేపీ నేత వివేక్ కొటాడియా ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.
వీడియో మనం గమనిస్తే.. ఆవుపై దాడి చేసిన సింహం.. దాని గొంతు పట్టుకుని ఉంది. ఆవును కిందపడేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఆవు కూడా దానిని ప్రతిఘటించింది. సింహం నోటికి చిక్కి నొప్పితో విలవిల్లాడిపోయిన ఆవు పెద్దగా అరుస్తుండటం రైతు అక్కడకు పరుగెత్తుకొచ్చాడు. అయితే ఏ మాత్రం భయపడలేదు. తన ఆవుని కాపాడే ఉద్దేశంతో ముందుకు సాగాడు. చెయ్యెత్తి అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. సింహం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు పక్కకు ఆవు జరిగింది.
ఇక అప్పుడు అక్కడ ఉన్న ఓ రాయిని తీసుకుని సింహం వైపు ఆ రైతు రావడంతో అది భయపడి.. ఆవు గొంతు విడిచిపెట్టి అక్కణ్నుంచి జారుకుంది. ఈ దృశ్యాలను అటుగా కారులో వెళ్తోన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయగా.. జనాగఢ్‌లోకి కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. రైతు ధైర్యంపై ప్రతి ఒక్కరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. . ‘రైతు ఆవుని సింహం నుంచి ధైర్యంగా రక్షించడం చాలా గొప్ప విషయం.. అయితే ఈ వీడియోను చిత్రిస్తున్న వ్యక్తి రైతుకు ఎందుకు సాయం చేయలేదో నాకు అర్ధం కాలేదు’ అని ఓ నెటిజన్ తన కామెంట్ సెక్షన్‌లో తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…