Vindhya Vishaka : యాంకర్ వింధ్య విశాఖ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. స్పోర్ట్స్ ప్రజెంటర్స్ గా మగవాళ్లే కనిపించే రోజుల్లో తన మాటలతో, చలాకీదనంతో తొలి తెలుగు క్రికెట్ వ్యాఖ్యతగా రాణిస్తోంది. తన హోస్టింగ్ తో క్రికెట్ అభిమానులను బాగా అలరిస్తుంది. ఐపీఎల్ 11వ సీజన్ నుంచి వ్యాఖ్యతగా ఉంటూ.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన ప్రొఫెషనల్ బాడీ లాంగ్వెజ్‌తో ఎంతో మంది క్రికెట్ అభిమానులను తన ఫ్యాన్స్‌గా చేసుకుంది వింధ్య విశాఖ. 1992 ఏప్రిల్ 18న సికింద్రాబాద్‌లో జన్మించిన వింధ్య విశాఖ మేడపాటి మొదట టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా రాణించింది. అనంతరం 20 మంది యాంకర్లను వెనక్కి నెట్టి ఐపీఎల్‌కు హోస్ట్‌గా అవకాశం దక్కించుకుంది.
అప్పటివరకు స్పోర్ట్స్ ప్రజంటర్‌గా మగవాళ్లను చూసిన తెలుగు తెరకు తొలి తెలుగు తెలుగు అమ్మాయిగా వింధ్య నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రికెట్‌తో తనకు ఉన్న అనుబంధం, అనుభవాలు చెప్పుకొచ్చింది. తన భర్త ఫోర్స్‌తోనే ముంబైకి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చాను. అలా తొలిసారి కబడ్డీకి సెలక్ట్ అయ్యాను. అప్పటి నుండి స్పోర్స్‌తో నా ప్రయాణం సాగుతుందని పేర్కొంది. ఇక ధోనిని ఎప్పుడైన కలిసారా అన్న ప్రశ్న వేయగా, ఆయన ఆటని దగ్గర నుండి చూశాను. మొన్న వైజాగ్ కూడా వెళ్లినప్పుడు ఆయన ఆటని దగ్గరగా చూశాను తప్ప కలవలేదు అని పేర్కొంది. అయితే ఓ సారి మాత్రం ముంబైలోని ఓ హోటల్ రిసెప్షన్ దగ్గర ఉన్నప్పుడు ధోని వచ్చి వెంకటపతి రాజుని పలకరించారు. నేను
ఎవరా అని వెనక్కి తిరిగి చూసే సరికి ఆయన ఉన్నారు.
![Vindhya Vishaka : ఎంఎస్ ధోనీపై తెలుగు క్రికెట్ యాంకర్ వింధ్య సంచలన కామెంట్స్..! Vindhya Vishaka sensational comments on ms dhoni](http://3.0.182.119/wp-content/uploads/2024/04/vindhya-vishaka.jpg)
ఆ సమయంలో రాజు నా గురించి చెప్పడం, మాట్లాడడం చాలా సరదగా అనిపించిందని వింధ్య తెలియజేసింది.ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. కొంతకాలం మోడలింగ్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు. ‘గోపాల గోపాల’, ‘ముకుందా’ సినిమాల్లో తనకు అవకాశం వచ్చిందని.. ఇంట్రస్ట్ లేని కారణంతో నో చెప్పానని అన్నారు. తనకు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకపోవడంతో, ఆసక్తి లేకపోవడంతో ఆ మూవీల్లో నటించేందుకు నో చెప్పినట్లు పేర్కొంది.