Vijayendra Prasad : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక నటుడే కాదు రాజకీయ నాయకుడు కూడా. జనసేన అనే పార్టీని స్థాపించి ఇప్పుడు ఏపీలో తమ పార్టీ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పై ఇటీవల కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్‌పై బాహుబలి రైటర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటే దోచుకోవడం, దాచుకోవడంగా మారింది. అలాంటి తరుణంలో గొప్ప నేతగా పవన్ కల్యాణ్ కనిపించాడు అని ఆయన అన్నాడు. హైదరాబాద్‌లో మహా టెలివిజన్ కొత్తగా ప్రారంభించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ మహా మ్యాక్స్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, విజయేంద్ర ప్రసాద్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ వీడియో చూశానని అందులో విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చిన హిందువులకి దాహార్తి తీర్చడానికి ముస్లింలు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ దృశ్యం నాకు ఎంతో ఆనందం కలిగించి ఇప్పటికీ కూడా దానిని తలచుకున్నా అంతే ఆనందంగా ఉందని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలి ఇలాంటివి జరగాలి అంటే నీతి నిబద్ధత ఉన్న నాయకుడు కావాలి అయితే అదృష్టవశాత్తు మనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు అంటే ప్రాణం ఇచ్చే అశేషమైన జన సైనికులు ఉన్నారు. నేను ఏం చెప్పానో అది దయచేసి మీవారితో చెప్పి మతసామరస్యం పెంచడం కోసం అందుకు అవకాశం, అదృష్టం రెండూ మీకు ఉన్నాయి చెయ్యండి అంటూ తెలిపారు.
అయితే విజయేంద్ర ప్రసాద్ సహా పవన్ కూడా మన దేశం పట్ల అపారమైన దేశభక్తి కలవారు మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో అని అందరు ఆలోచనలు చేస్తున్నారు. నేటి తరం రాజకీయాల గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏం మాట్లాడుతారో.. ఏం ఆలోచిస్తూ ఏం మాట్లాడుతారో అనే విధంగా ఒక నీతి, నిజాయితీ కల లీడర్ కావాలి. మన అదృష్టం కొద్ది మనకు పవన్ కల్యాణ్ లాంటి లీడర్ దొరికాడు అని పవన్ కల్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడం కొసమెరుపు.విజయేంద్ర ప్రసాద్‌కి అలానే రాజమౌళికి కూడా పవన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో సినిమాలు చేయాలని వారద్దరు కోరుకుంటున్నారు. మరి జరుగుతుందా లేదా అనేది చూడాలి.