Vijayashanti : మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ రాబోతుండగా, రాజకీయాలలో అనేక మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఒకపార్టీ నుండి ఇంకో పార్టీకి జంప్ అయ్యే వారి సంఖ్య క్రమేపి పెరగనుంది.కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ముఖ్య నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఢిల్లీ..బెంగళూరు కేంద్రంగా మంత్రాంగం ముమ్మరం అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రేసులో ఒక అడుగు ముందు వేయగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక పనిలో ఉన్నాయి. ఇప్పటికే పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాయి. అయితే ఈలోపు ప్రత్యర్థి పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానించేందుకు అన్ని పార్టీలు పక్కా స్కెచ్‌లతో ముందు అడుగు వేస్తున్నాయి.
తాజాగా బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి చేసిన ఓ ట్వీట్ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనకు అభిమానం.. గౌరవం అని విజయశాంతి చెప్పడంతో బీజేపీలో కలవరం మొదలైంది. ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అని అన్నారు. అయితే మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్య పూర్తిగా అయోమయ అంశమని ఆమె పేర్కొన్నారు. విజయశాంతి ట్వీట్‌లో .. “ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అని అనడం అనేక అనుమానాలని కలిగిస్తుంది.
మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం. అర్థం కాని విషయం కూడా.. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తుందా..? కాంగ్రెస్ ఓడిపోతుందా..? ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా..? కాబట్టి ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా..? ఒక్క మాటలో దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చేయగలుగుతుందా..? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం.. రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం..” అని ఆమె చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…