Vijayashanti : ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికలు రావడం, అవి సజావుగా పూర్తి కావడం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ఒక గంట ముందుగా అంటే సాయంత్రం 4గంటలకే ముగిసింది. తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషుల ఓట్లు 1,62,98,418 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు. మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
ఓటింగ్ సమయంలో అనేక ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. సినీ ప్రముఖులు అందరు పొద్దున్నే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సామాన్యుల మాదిరిగానే వారు కూడా క్యూ లైన్‌లో నిలుచొని ఓటు వేసారు. మెగాస్టార్ చిరంజీవి సైతం చాలా సేపు లైన్‌లో నిలుచొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కిడ్స్ పాఠశాలలో ఆమె ఓటు వేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అయితే, షర్మిల పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో ఆమెకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎదురుపడ్డారు. అప్పటికే ఓటు వేసి బయటికి వస్తున్న రాములమ్మను చూసిన షర్మిలమ్మ ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. వెంటనే విజయశాంతి కూడా ప్రతి నమస్కారం చేశారు. అనంతరం విజయశాంతి బయటికి వెళ్లగా.. షర్మిల ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు.ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…