Vijaya Shanti : లేడి అమితాబ్ బచ్చన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సోలోగానే కాకుండా పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించింది. చిరంజీవి, బాలకృష్ణ సరసన విజయశాంతి ఎక్కువ సినిమాలు చేయగా, అవి మంచి విజయం సాధించాయి. అయితే రౌడీ ఇన్‌స్పెక్టర్ అనే సినిమాలో బాలయ్య, విజయశాంతి కలిసి నటించగా, ఈ సినిమా ఎడిటింగ్ సమయంలో ఒక ఫైట్ తీసేయాల్సి వచ్చింది. విజయశాంతి ఫైట్ తీసేస్తానని దర్శకుడు గోపాల్ విషయం బాలయ్యకు చెప్పాడు. అందుకు బాలయ్య ఒప్పుకోలేదు.అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్ ను తీసేయడం సమంజసం కాదని చెప్పాడు.కావాలంటే తన ఫైట్ ఒకటి తీసేయాలన్నాడు.
బాలయ్య ఉదార స్వభావం పట్ల గోపాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.అనుకున్నట్లుగానే సినిమాలో విజయశాంతి ఫైట్ ఉంచారు. సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతున్నప్పుడు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. ట్రైన్‌లో పాట చేస్తున్నప్పుడు క్రౌడ్ విపరీతంగా వచ్చి షూటింగ్ కూడా ఆపేశారు. విపరీతమైన ఎండలోనే సాంగ్ షూట్ చేశాం. దాని వలన చాలా జ్వరం వచ్చింది. పడుకున్నా. అరుపులు, నానా హంగామా చేశారు అభిమానులు. బాలకృష్ణ వెళ్లి చెప్పిన కూడా విజయశాంతి రావాలని అన్నారు. ట్రైన్ కూడా కదలనివ్వలేదు.

ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చారు. అద్దాలు కూడా పగలగొట్టారు. అమ్మా అప్పుడు జనాలు చూసి నేనే షాకయ్యాను అని విజయశాంతి అన్నారు. ఇక తనకి పార్టీలకి వెళ్లే అలవాటు లేదని, చిరంజీవి గారు ఎప్పుడు ఆహ్వానించలేదని, పిలిచిన కూడా వెళ్లను అని విజయశాంతి అన్నారు. తనకు ఇల్లు, పని తప్ప వేరే ప్రపంచం తెలియదు అని విజయశాంతి చెప్పుకొచ్చింది.కాగా, విజయశాంతికి స్టార్ హీరోలని మించిన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది.