Vijaya Sai Reddy : రానున్న ఎన్నికలని ప్రతి పార్టీ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, మరో ప్రతిపక్షం జనసేన కూడా ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీ నేతలను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మరోపక్క ప్రతిపక్షాలు వైసీపీనీ ఎలాగైనా గద్దె దించాలని ప్రజా పోరాటాలతో పాటు పొత్తులకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నాయి. నారా లోకేష్ అయితే వైసీపీ నాయకులపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నానిపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
నరసరావుపేట లో మీడియాతో మాట్లాడుతూ…వచ్చే ఎన్నికలలో 25కి 24 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవబోతుందని జాతీయ సర్వేలు చెబుతూ ఉండటంతో టీడీపీ… ఎల్లో బ్యాచ్ కి నిద్ర పట్టడం లేదని అన్నారు.టీడీపీ అర్థరహితమైన విమర్శలు చేస్తుందని చంద్రాయన్ స్పీడ్ తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తుందంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు. చంద్ర పేరుతో ఉన్న చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికలలో గెలుస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్లుగా చంద్రయాన్ విజయం పై తెలుగుదేశం పార్టీ హడావిడి చేస్తుందని విమర్శ చేశారు.
![Vijaya Sai Reddy : కొడాలి నానిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకి విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ Vijaya Sai Reddy strong counter to lokesh for his comments](http://3.0.182.119/wp-content/uploads/2023/08/vijaya-sai-reddy.jpg)
లోకేష్ ఇంకా చంద్రబాబు గెలిస్తే తంతాం.బట్టలూడదీస్తాం .అని అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారని అన్నారు. టీడీపీ లో అందరూ సంఘవిద్రోహశక్తులే. ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు.అని మండిపడ్డారు విజయసాయిరెడ్డి . చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టించుకుంటున్నా వార్డులో వైసీపీ గెలిచిందని స్పష్టం చేశారు.సీఎంనే అయ్యన్న అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు కాదు.అరగుండు పాత్రుడు అంటూ ఎద్దేవా చేశారు. పల్నాడులో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని.గెలవబోతున్నామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులు. టీడీపీ అధికారంలో రావటం కల్ల. సీఎంనే అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడు అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.