Vijaya Sai Reddy : రామోజీరావు అరాచ‌కాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.. త‌ర్వాత ఆయ‌నే అన్న విజ‌యసాయి రెడ్డి..

Vijaya Sai Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. మొన్నంతా చంద్రబాబు అరెస్ట్, విచారణ సాగగా… నిన్నంతా విజయవాడ ఏసిబి కోర్టులో వాదనలు సాగాయి. సుదీర్ఘ విచారణ అనంతరం టిడిపి హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర వుందన్న సిఐడి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించ‌డంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఉంచారు. చంద్రబాబు అరెస్ట్ త‌ర్వాత వైసీపీ నేత‌లు ఆయ‌న గురించి అనేక ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ ఏపీ రాజ‌కీయం మ‌రింత హీటెక్కిస్తున్నారు.

చంద్ర‌బాబు అరెస్ట్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి పని చేసినప్పుడు లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సైతం చోటు చేసుకుందని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు భారీ మోసానికి పాల్పడ్డారనేది సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా నిర్ధారించారని గుర్తు చేశారు.

Vijaya Sai Reddy said next ramoji rao to be arrested
Vijaya Sai Reddy

ఏ కుట్ర చేసినా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నాడని చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్న విషయం ఈ రోజు అర్ధమై ఉంటుందని అన్నారు. చట్టానికి అందరూ లోబడి పని చేయవల్సిందేనని చంద్రబాబు మీద ఈ ఒక్క కేసే కాదు ఇంకా ఏడు కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఎలాగోలా వ్యవస్థలను మేనేజ్ చేసాడు ఇక ఇప్పుడు కుదరదని ఈ కేసులో చంద్రబాబుకు తప్పకుండా పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తర్వాత రామోజికి కూడా జైలు శిక్ష తప్పదని అన్నారు. ఇన్నాళ్లు తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాడు శిక్షను అనుభవించక తప్పదని, దీనికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయనీ పేర్కొన్నారు విజ‌య‌సాయి రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago