తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. తెలుగు, తమిళంలో రూపొందిన ‘వారసుడు’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ. 200 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి హవాను చూపిస్తోంది. తెలుగులోనూ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరేందుకు అడుగు దూరంలోనే ఉంది . పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ‘వారుసుడు’ హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయి పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు రాగా, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాని అన్ని భాషల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఇది విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోబోతుందన్న మాట. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ దీనికి సంబంధించి చిత్ర వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఎంత పెద్ద హిట్ మూవీ అయినా నాలుగు వారాల్లో ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని కొట్టిపారేయలేం.
ఇళయదళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుష్బూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. తమిళ్ వెర్షన్ వారిసు ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టడంతో దిల్ రాజు సేఫ్ అయ్యాడనే చెప్పాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…