Vijay Deverakonda : సోషల్ మీడియిలో వచ్చే పుకార్లకి పులిస్టాప్ అనేదే ఉండదు. నిత్యం ఎన్నో వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. సెలబ్రిటీల ప్రేమాయణాల గురించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. విజయ్ దేవరకొండతో హీరోయిన్ రష్మిక మందన్న డేటింగ్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కొద్దిరోజులుగా రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జోడీ.. గీత గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ రొమాంటిక్ జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది.
అనంతరం ఎవరికి వారు బిజీ బిజీ అయ్యారు. స్టార్ స్టేటస్ పట్టేసి పలు భారీ సినిమాల్లో భాగమవుతూనే.. వీలు కుదిరినప్పుడల్లా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రష్మిక – విజయ్ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరగుతుంది. అయితే ఈ విషయంపై ఓ సారి స్పందించిన రష్మిక తామిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పింది. అయితే ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఇటీవల రష్మికని పక్కన పెట్టి కొత్త లవర్‌ని కనిపెట్టాడని, ప్రస్తుతం ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని చెబుతున్నారు ఓవర్సీస్ క్రిటిక్‌గా భావించే ఉమైర్ సంధు. తన ట్వీట్‌లో షాకింగ్ విషయం చెప్పుకొచ్చాడు.
రష్మిక మందన్నతో బ్రేకప్ తర్వాత విజయ్ దేవరకొండ కొత్తగా టైమ్ పాస్ లవ్‌ని కనుగొన్నాడు. `ఖుషీ` సినిమా కాశ్మీర్ షెడ్యూల్‌లో సమంతతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరిద్దరు శ్రీనగర్‌లో ఒకే హోటల్‌లో ఉంటున్నారు` అని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఇలా చెత్త కామెంట్స్ పెట్టే ఉమైర్ సంధుని నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు. శృతి మించి తప్పుడు కామెంట్స్ చేస్తే ఊరుకునేదే లేదని కొందరు ఫ్యాన్స్ వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…