Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి కొన్నాళ్లుగా అనేక వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సమంతతో కలిసి ఖుషి అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి. అయితే విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమాయణంలో ఉన్నట్టు అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమ తర్వాత… వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. రష్మిక పెళ్లి క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండ అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తాయి. దానికి కారణం రష్మిక దిగిన ఫోటోలు.. విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలు లొకేషన్ ఒక్కటే కావడం. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు.
వారిద్దరిని చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో పెడుతున్నారు. అయితే తాజాగా వీరిద్దరు ఎయిర్పోర్ట్లో మెరిసారు.ఎదురెదురు పడడంతో వారికి సంబంధించిన పొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. రష్మిక, విజయ్ దేవరకొండ లివ్ ఇన్ ఉన్నారనే విషయం ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలతో మరోసారి బయటపడింది. విజయ్ రష్మిక చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీనితో వీరిద్దరూ నిజంగానే కలిసి ఉంటున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ.. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.