Vijay Antony : తమిళ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. సినిమాలో విజయ్ ఆంటోని నటనకు మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. రీసెంట్‌గా బిచ్చగాడు సీక్వెల్ బిచ్చగాడు-2 పేరుతో మరో సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది. రీసెంట్‌గా విజయ్ ఆంటోని తన సినిమా ప్రమోషన్స్ వైరైటీగా చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు విజయ్ ఆంటోని. మణికొండలో ఉన్న 1980 మిలటరీ హోటల్ పేరుతో ఉన్న రెస్టారెంట్‌లో వెయిటర్‌గా మారాడు విజయ్ ఆంటోని.
సినిమాలో నటించినట్లుగానే రియల్ లైఫ్‌లో కూడా హీరో కస్టమర్లకు బిర్యానీ ప్లేట్లు, ఫుడ్ ఐటమ్స్ సప్లై చేశాడు. తెరపై సందడి చేసే హీరో విజయ్ ఆంటోని ..డైరెక్ట్‌గా హోటల్‌కి వెళ్లడం అందులో వెయిటర్ డ్రెస్ వేసుకొని తమకు వడ్డన చేయడం చూసి కస్టమర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాంటి మెమరీస్‌ని తమ సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. హీరోతో సెల్ఫీలు దిగడం, వీడియోలను తమ ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి పంపుకోవడం వంటివి చేశారు. సినిమా సక్సెస్ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనితో పాటు చిత్ర బృందం కూడా హోటల్‌ని విజిట్ చేసింది. మీ హోటల్‌ని సందర్శించిన మాకు ఆతిధ్యం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అంటూ హీరో విజయ్ ఆంటోని తన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. అదే హోటల్‌లో పని చేస్తున్న కొందరు సిబ్బందితో కలిసి ఫోటోలకి పోజులు కూడా ఇచ్చారు విజయ్.
బిచ్చగాడు 2 చిత్రాన్ని జనాలలోకి మరింత తీసుకెళ్లే క్రమంలో విజయ్ ఆంటోని. కొన్ని పుణ్య కార్యాలు కూడా చేస్తాడు.తిరుపతిలో ఉన్న యాచకులకు యాంటీ బికిలీ కిట్స్ అందించాడు. అలాగే మరికొంతమంది యాచకులను 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్లి మరీ.. స్వయంగా తన చేతులతో బిర్యానీ వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక ఇదిలా ఉంటే విజయ్ ఆంటోని త్వరలో బిచ్చగాడు 3 సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా చాలా రిచ్‌గా తెరకెక్కించనున్నట్టు తెలియజేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…