Vijay Anthony Daughter Meera : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు విజయ్ ఆంటోని. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. 16 యేళ్లు వయస్సున్న విజయ్ కూతురు.. .చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఈమె ఈ అఘాత్యానికి పాల్పడింది. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి అనే కోణంలోనే జనాలు చర్చించుకుంటున్నారు.
విజయ్ కూతురు మీరా సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం చదువులో మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలియగా.. తాజాగా ఆమె టీచర్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అలానే ఆమె రాసుకున్న డైరీ కూడా చర్చనీయాంశం అయింది. మీరా మృతిపై ఆమె టీచర్ రియాక్ట్ అవుతూ.. చదువు విషయంలో మీరాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఆమె టాపర్ కాదు కానీ.. తెలివైన విద్యార్థి అని చెప్పారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నదో అర్ధం కాలేదని, మీరా సూసైడ్ వ్యవహారం మాకు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని స్కూల్‌కు చెందిన టీచర్ తెలిపారు. మా పాఠశాలలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయం అని, స్కూల్‌లో ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదని టీచర్స్ స్పష్టం చేశారు.
మీరాకి ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఇంత చిన్న వయసులో మీరాపై ఎలాంటి ఒత్తిడి ఉందో తెలియదు. ఇలాంటి నిర్ణయం తీసుకొంటుందని మేము ఊహించలేదు. స్కూల్‌లో గానీ, స్కూల్ నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి ఆమెపై లేదు అని టీచర్ వెల్లడించారు.ఇక ఆమె డైరీలో తన తండ్రి గురించి స్నేహితులు తనకు ఎలాంటి బాధ వచ్చిన కూడా చాలా అండగా ఉంటారని కూడా రాసుకొచ్చింది. మీరా సూసైడ్ నేపథ్యంలో చెన్నై పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి సూసైడ్ చేసుకొన్న గదిని తనిఖీలు చేశారు. ఆమె నుంచి చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లింది? చివరి మెసేజ్ ఎవరికి వెళ్లింది? ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో నిపుణులు విచారిస్తున్నారు.
https://youtube.com/watch?v=C5pNvWzExYE