Vidadala Rajini : రేపు దేశమంతటా రాఖీ వేడుకలు అట్టహాసంగా జరుపుకోనున్న విషయం తెలిసిందే. అన్న చెల్లెల్ల అనుబంధానికి ప్రతిరూపంగా జరిగే పండుగ రాఖీ జరుపుకుంటారనే విషయం తెలిసిందే. అయితే ప్రతి సోదరి.. తన సోదరుడికి, తన సోదరుడిలా భావించే వ్యక్తులకు రాఖీ కడుతుంది. అంతేకాక రాఖీ కట్టినందుకు తమ సోదరిమణులకు వివిధ రకాల గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఈ పండగ సందర్భంగా ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీలు కట్టారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాఖీ పండగను జరుపుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని రాఖీ కట్టింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్‌కు మంత్రి విడదల రజిని రాఖీ కట్టి అనంతరం స్వీటు తినిపించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. ఇటీవలే నగరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా.. సీఎం జగన్ కి రాఖీ కట్టిన సంగతి తెలిసిందే. రాఖీ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు.
అక్కచెల్లెమ్మలు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడినని ఆయన తెలిపారు. మహిళ సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు.ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడు అక్కచెల్లమ్మలకు అండగా ఉంటాని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది కూడా జగన్‌కి వైసీపీకి చెందిన యువతులు రాఖీలు కట్టి స్వీట్ తినిపిస్తున్న విషయం తెలిసిందే.