Venu Swamy : వేణు స్వామి.. ఇటీవల జాతకాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకుల గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరి కొద్ది రోజులలో ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ 2024,2029లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన మరో కేసీఆర్ కావడం పక్కా అని అన్నారు. ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అడ్రెస్ గల్లంతు అని అన్నట్టు వేణు స్వామి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక జరిగినట్లే కనిపించినా..ఏదైనా జరిగే అవకాశ ఉందంటూ వేణుస్వామికొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆ రెండు పార్టీల పొత్తు తనకు ప్రశ్నగానే ఉందని ఆసక్తిని పెంచే విశ్లేషణ చేసారు.
షర్మిల జాతకం ప్రకారం రాజయోగం అనుభవించేది లేదు కాబట్టి ఆమె నచ్చినట్టు చేస్తుంది. ఆమె జీవితం పెద్ద గొప్పగా ఉండదు. జగన్ లేకుండా షర్మిల లేదు. నారా లోకేష్ ఎంఎల్ఏ గా గెలుస్తారా అంటే అది జరగొచ్చు. కాని ముఖ్యమంత్రి కావడం కష్టం అని వేణు స్వామి అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని ఆయన అడగగా, అది ఆయన కెరీర్‌పై ఫోకస్ ఉంది కాబట్టి అలా సైలెంట్‌గా ఉన్నాడని పేర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మహా నక్షత్రం. ఆయన రాజకీయాలలోకి టైం ఉంది. 2030 వరకు ఎన్టీఆర్‌ని రాజకీయాలలో రానివ్వొద్దని ఆయన అమ్మగారికి చెప్పినట్టు వేణు స్వామి స్పష్టం చేశాడు.
![Venu Swamy : చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణు స్వామి..! Venu Swamy told how many seats chandra babu will get](http://3.0.182.119/wp-content/uploads/2024/02/venu-swamy.jpg)
లోకేష్‌కు 2024 వరకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. 2024లో లోకేష్ గెలవటం కష్టం. ఏ రెమిడీ తీసుకున్నా.. సబ్జెక్ట్ చెయ్యి దాటి పోయింది’’ అని అన్నారు. పవన్ కు జనాదరణ విపరీతంగా ఉంటుందని..కానీ, ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు..పవన్ ఒక వేళ కలిసిన జగన్ కు టఫ్ ఫైట్ ఇస్తారని..ఓడించలేరని..ఏపీలో అధికార మార్పిడి వంటి అద్బుతాలు జరిగే అవకాశాలు లేవని వేణుస్వామి తన అంచనాగా వెల్లడించారు. కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని వివరించారు. బీజేపీకి సీట్లు తగ్గుతాయని..హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పుకొచ్చారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా త్వరలో విడిపోయే అవకాశం ఉంటుందని వేణు స్వామి అన్నాడు. వారి జాతకాలు అలా ఉన్నాయని ఆయన స్పష్టం చేశాడు.