Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు లేరు. ఆయన సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి వార్తలలోకి ఎక్కారు. సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను ఓడించలేరని ఆయన తెలిపారు.
తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్య్వూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘటించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ… ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూంటే మీరు… మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణు స్వామిని ప్రశ్నిస్తారు. నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని.. జ్యోతిషుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేనాని పవన్ కల్యాణ్ మోసపోవడం ఖాయమన్నారు. పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని, తను ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించాడు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు కాబట్టి ఆయనకు రాజయోగం లేదని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగలేరని వేణు స్వామి చెప్పారు. అంతేకాదు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి తన జాతకాన్ని విప్పారు. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ రానున్న రోజులలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సింది. మరోవైపు వరుస సినిమాలు చేస్తూ సినీ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ . ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్ హడావిడి ముగియగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నారు పవన్ కళ్యాణ్.