Venu Swamy : వేణు స్వామి.. ఇప్పుడు ఆయన సెలబ్రిటీగా మరాడు. ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెబుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. వేణు స్వామి చెప్పినట్టు సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఇక నిహారిక విడాకుల గురించి కూడా వేణు స్వామి ముందే చెప్పాడని మధ్య జోరుగా ప్రచారంసాగుతుంది. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్న గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది వారసులు పరిచయం కాగా, బాలయ్య తనయుడు కూడా త్వరలో ఆరంగేట్రం చేయబోతున్నట్టుట ఎప్పటి నుండో ప్రచారం నడుస్తుంది. మోక్షజ్ఞను వెండి తెర మీద చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కి ఇంకెన్నో రోజులు సమయం లేదని అంటున్నారు. ఇక సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నందమూరి మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. కానీ ఆసల్యంగా వస్తాడు. అయితే లేట్‌గా వచ్చినా సరే.. తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడు. సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉంది. అభిమానులను అలరించి.. స్టార్‌గా ఎదుగుతాడు అని చెప్పుకొచ్చారు. అలానే మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని.. సినిమాలే తనకు క్రేజ్ పెంచుతాయని తెలిపాడు. వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఇటీవల తన బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చేసి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నడు. త్వరలోనే ఆయన వెండితెర ఎంట్రీ ఉంటుందని సమాచారం.