Venkatesh Wife Neeraja : విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా… ఆతర్వాత తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలకి పెద్ద పీట వేస్తూ ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. వెంకటేష్ వృత్తిపరమైన విషయాలు తప్పితే.. ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు.ఆయన భార్య, పిల్లల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించరు. వెంకటేష్ సినిమాల ఈవెంట్స్‌కు కూడా తన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు.
ఇక వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. వెంకటేష్ వివాహం కోసం తండ్రి రామానాయుడు సంబంధాలు చూసేటప్పుడు డబ్బు, కులం వంటివి పట్టించుకోకుండా అమ్మాయి గుణగణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెంకటేష్‌కు నీరజారెడ్డి తో వివాహం జరిపించారు. ఇక ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి. ఆమె తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి. నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే.. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు వెంకటేష్, నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు.
నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది. ఎపుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్. దీంతో కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ. తాజాగా నీరజా రెడ్డి కోకా పేటలోని శివ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ సమయంలో చాలా సింపుల్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆమెని చూసిన అభిమానులు ఎందుకు ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక నీరజ, వెంకటేష్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. డిసెంబర్ 13,1987లో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. అయితే వెంకటేష్ భార్య నీరజారెడ్డి చదువుకునే రోజుల్లోనే వ్యాపార రంగంలోకి వెళ్లాలని కలలు కనే వారట. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆమె పెళ్లి జరిగిపోయింది.