Venkatesh : విక్టరీ వెంకటేష్ ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఇప్పటికీ కూడా ఆయన మంచి విజయాలు సాధిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ప్రస్తుతం వెంకీ మామ సైంథవ్ అనే చిత్రం చేస్తున్నారు. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్ యాక్టర్ ఆర్య తదితరులు నటించారు. జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. వాస్తవానికి డిసెంబరు 22నే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆరోజు సలార్, 21న డంకీ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
గుంటూరు, విజయవాడ పట్టణాల్లో సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు గుంటూరుకు సమీపంలోని వీవీఐటీ కళాశాలలో, సాయంత్రం 5.00 గంటలకు విజయవాడకు సమీపంలోని కేఎల్ యూ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడకి వచ్చిన వెంకటేష్.. స్థానిక బాబాయ్ హోటల్ వద్దకు కారులో చేరుకొని . అక్కడే టిఫిన్ చేస్తున్నవారిని ఏం టిఫిన్ టేస్టీగా ఉందని అడిగి తెలుసుకున్నారు. వారు ఇడ్లీ అని చెప్పడంతో.. ఓనర్ వద్దకు వెళ్లి నాక్కూడా ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వండమ్మా అంటూ సరదాగా మాట్లాడారు.
ఆయన్ను చూడగానే అభిమానులు ఆనందంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. అందరినీ వెంకీ మామ.. ఆప్యాయంగా పలకరించారు. వారితో పాటే ఓ టేబుల్‌పై కూర్చొని ఇడ్లీ ఆరగించారు. అంత పెద్ద స్టార్ హీరో వచ్చి తమతో టిఫిన్ చేయడం.. తమతో కలిసిపోవడం చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదంతా జరుగుతుండగా.. డైరెక్టర్ శైలేష్ కొలను వీడియో తీయడం కొసమెరుపు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…