Venkatesh : విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఫ్యామిలీ చిత్రాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ఫ్యామిలీ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ని ఫ్యాన్స్ ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తున్నారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. వెంకటేష్ తన పని తాను చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయే రకం. అయితే నారప్ప మూవీ ప్రమోషన్ సమయంలో వెంకటేష్ సౌందర్య గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పవిత్ర బంధం సినిమాలో సౌందర్య కాళ్లను పట్టుకున్న పోస్టర్ రిలీజైన సమయంలో ఇలాంటి సినిమాలు చూడరంటూ కామెంట్లు చేశారని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
స్క్రిప్ట్ ను నమ్మి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు కొత్త కథలు తెరపై చూసే అవకాశం అయితే కలుగుతుందని వెంకటేష్ చెప్పుకొచ్చారు.క్యారెక్టర్ ను బట్టి మనం మారాలని హీరో ఎలివేషన్లు ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదని వెంకటేష్ అన్నారు. నారప్ప లాంటి సినిమాలు అరుదుగా వస్తాయని వెంకటేష్ చెప్పుకొచ్చారు.నారప్పలో చెప్పులు విప్పి కాళ్ల మీద పడే సీన్ ఒకటి ఉంటుంది.ఇలాంటి సన్నివేశాలు హీరో చేస్తే బాగుంటుందా.? అని మనం ఆలోచిస్తామని వెంకటేష్ వెల్లడించారు.కంటెంట్ బాగుండి సీన్ డిమాండ్ చేస్తే అలాంటి సినిమాలు చేయడం తప్పు లేదని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలను వదులుకోకూడదని వెంకటేష్ అన్నారు.
వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, గీతాకృష్ణ, రాజీవ్ కనకాల, రావు రమేష్, నాజర్ వంటి వాళ్ళు నారప్ప చిత్రంలో నటించారు. ధనుష్ నటించిన అసురన్ మూవీకి రీమేక్ గా వచ్చినప్పటికీ ఒరిజినల్ అనేది చెడిపోకుండా చాలా అద్భుతంగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఒరిజినల్ అన్నట్టు చేశారు. వెంకటేష్ చేసే రీమేక్ లు అలానే ఉంటాయి. ఒరిజినల్ ని మర్చిపోయేలా చేస్తారు. ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఈ మూవీని తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల పాత్ర కూడా చాలా ఉంది. ఈ మూవీలో నారప్పకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మునికన్నగా కార్తీక్ రత్నం నటించగా.. చిన్న కొడుకు సీనప్పగా గీతాకృష్ణ నటించాడు. సినిమాలో ఈ చిన్నోడి క్యారెక్టరే హైలైట్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…