Rana Naidu : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నిజ జీవితంలో బాబాయ్.. అబ్బాయ్‌గా ఉన్న వీరు.. వెబ్ సిరీస్‌లో తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సిరీస్‌లో రానా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా.. నేరం చేసి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన క్రిమినల్ గా వెంకీ కనిపించాడు. తండ్రిని విపరీతంగా ద్వేషించే కొడుకు పాత్రలో రానా తన నట విశ్వరూపం చూపించాడు. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రానానాయుడుకు సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
రానా నాయుడు వెబ్ సిరీస్ కోసం ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన వెంకటేష్, రానాకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించినందుకు కాను…వెంకటేష్ కు 12కోట్లు తీసుకోగా, రానాకు 8 కోట్లు దాకా ఇచ్చారని తెలుస్తోంది. రెగ్యులర్ గా వెంకటేష్ కు 10 కోట్లు తీసుకుంటాడు. కాని ఈ వెబ్ సిరీస్ కోసం 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం. ఇది ఒక డార్క్ ఫ్యామిలీ కథ కాగా, ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండదు. ఇందులో డైలాగ్స్ దారుణంగా ఉంటాయి. తొలిసారి వెంకీ ఇలాంటి డైలాగ్స్ మాట్లాడడంతో అందరు అవాక్కయ్యారు.
హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు. ఈ సిరీస్ లోని వెంకీ, రానా పాత్రలు నిజ జీవితాలకు పూర్తి భిన్నమైనవని.. ఇందులో చాలా డార్క్ షేడ్స్ ఉంటాయని.. ఈ సిరీస్ ను ఒంటరిగానే చూడాలని.. ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడొద్దంటూ ప్రచార కార్యక్రమాల్లో రానా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.ఇక రానాకి కొంత కాలంగా సరైన సక్సెలు లేకపోగా, ఈ వెబ్ సిరీస్‌తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…